calender_icon.png 5 May, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రీ కంగారూ విశేషాలు..

04-05-2025 12:00:00 AM

ఈ జంతువు గోల్డెన్ మాంటెల్డ్ ట్రీ కంగారూ. న్యూగినియా ద్వీపం దీని స్వస్థలం. ఈ జంతువు పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటుంది. అత్యంత అరుదైన జంతువు. ప్రస్తుతం ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి. వీటి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 మాత్రమే ఉన్నాయని చెబుతున్నరు శాస్త్రవేత్తలు. ఈ జంతువులు కూడా ట్రీ కంగారుల్లాగే చెట్లపై నివసిస్తాయి.

ఆకులు, చిన్న చిన్న కొమ్మలు, వేర్లు, బెరడు, పండ్లను ఆహారంగా తీసుకుంటుంది. ట్రీ కంగారూ న్యూగినియనాలోని టోరిసెల్లి పర్వతాలు, ఇండోనేషియాలోని ఫోజా పర్వతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ ప్రాంతాలు సముద్ర మట్టానికి 680 నుంచి 1,700 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. 

బంగారు రంగులో మెరిసిపోతూ.. చేతులు, మెడ, కడుపు భాగం లేత రంగులో ఉంటే.. వీపు భాగం ముదురు రంగులో కనిపిస్తుంది. ఒత్తున ఉన్నితో చిన్నపాటి ఎలుగుబంటిలా కనిపిస్తుంది. పొడవైన తోకను కలిగి ఉంటుంది. కంగారూలకు ఉన్నట్లే ఈ జంతువు కడుపుకు కూడా సంచి ఉంటుంది. ఇందులోనే తమ పిల్లలను భద్రపరుచుకుంటుంది. ట్రీ కంగారూ జీవితకాలం 5-15 సంవత్సరాలు. దాదాపు ఏడు కిలోల వరకు బరువు ఉంటుంది.