14 August, 2026 | 5:22 AM

ఎల్‌ఈటీ సయీద్‌కు దాసుడినే

14-08-2026 12:46 AM
  1. పాక్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
  2. భారత్‌పై విషం గక్కిన రషీద్

ఇస్లామాబాద్, ఆగస్టు 13: లష్కర్ ఏ తొ యిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు తాను దాసుడినని, తన ఫోన్‌లో హఫీజ్ నెంబర్ దొరక డం వల్లే తనను అమెరికా నుంచి బహిష్కరించారని పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్ గత ంలో చేసిన వ్యాఖ్యలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వెలుగు లోకొచ్చాయి.

రషీద్ ఆ సభా వేదికపై నుంచి మాట్లాడుతుండగా అదే వేదికపై లష్కర్ ఏ తొయిబాకు చెందిన కమాండర్, పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) అధ్యక్షు డు అయిన ఖాలిద్ మసూద్ సంధు, మరో ఉగ్రవాద సభ్యుడు ఖారీ ముహ్మద్ యాకూ బ్ షేక్ కూడా ఉండడం గమనార్హం. భారత్‌పై రషీద్ విషం గక్కాడు. రషీద్ వ్యాఖ్యల తో ఉగ్రవాదుల గ్రూపులను పెంచి పోషిస్తున్నది ప్రభుత్వమేనని, వారి వెనుక రాజకీయ నేతలూ ఉన్నారనే విషయం మరోమారు స్పష్టమైనట్లయ్యింది.