14 August, 2026 | 2:58 AM

600 మంది గర్భిణుల వీసాలు రద్దు

14-08-2026 12:48 AM
  1. పౌరసత్వం అమ్మకానికి లేదు
  2. ముఠాలపై బర్త్ టూరిజం ఉక్కుపాదం
  3. అమెరికా దౌత్య సెక్రటరీ

వాషింగ్టన్, ఆగస్టు 13: అమెరికా పౌరసత్వం అమ్మకాని లేదని, ‘బర్త్ టూరిజం’ ముఠాలపై చేపట్టిన చర్యల్లో భాగంగానే గత నెల జూలైలో 600కు పైగా గర్భిణులకు వీసాలను రద్దు చేశామని అమెరికా విదేశాంగ శాఖ సెక్రెటరీ మార్కో రూబియో తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. వీసా వ్యవస్థను, దేశ చట్టాలను మోసగిస్తూ నేర సంస్థలు పిల్లలకు పౌరసత్వం కల్పించడం కోసం ఫోర్జరీ పత్రాల ద్వారా భారీ లాభాలు గడిస్తున్నాయని ఆరోపించారు.

ఇలాంటి నెట్‌వర్క్‌లను గుర్తించి నిర్మూలించడానికే స్టేట్ డిపార్ట్‌మెంట్ బర్త్ టూరిజం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. అమెరికా చట్టాల ఉల్లంఘన, దుర్విని యోగాన్ని అంతం చేయడానికే ఈ విభాగం వీసా హోల్డర్ల కార్యకలాపాలను నిరంతరం సమీక్షిస్తుందన్నారు. అమెరికా పౌరసత్వ సమగ్రతను కాపాడేందుకు స్టేట్ డిపార్ట్‌మెంట్ అందుబాటులో ఉన్న అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు. కఠినతరమైన నిబంధనల వల్ల అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 1.12 లక్షలు తగ్గింది.