12 July, 2026 | 2:15 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

నేను లక్కీ ఛార్మ్ కాదు

01-07-2024 12:05 AM

భారతీయ సినిమాలో సంచలనం సృష్టిస్తున్న ‘కల్కి’ చిత్రంలో విజయ్ దేవర కొండ అతిథి పాత్రలో తళుక్కుమన్న సంగతి తెలిసిందే. మహాభారతం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో నటించి మెప్పించారాయన. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ “ఇలాంటి గొప్ప సినిమాలో నేను చిన్న భాగమవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ వారితో గల అనుబంధంతోనే ఈ పాత్ర చేశాను” అని తెలిపిన ఆయన, దర్శకుడు నాగ్ అశ్విన్ తనను లక్కీఛార్మ్ అనడం గురించి స్పందిస్తూ “నేను లక్కీ ఛార్మ్ కాదు.

తను అలా చెప్తాడంతే. మహానటి, కల్కి సినిమాలు బాగుండటం వలనే ప్రేక్షకులు చూస్తున్నారు. అంతేకానీ, నేను నటించానని కాదు” అని అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అతిథి పాత్రల్లో అలరించిన విజయ్, దుల్కర్ సల్మాన్ ‘కల్కి’ సీక్వెల్ లోనూ కనపడనున్నట్టు ఊహాగానాలు సాగుతున్నాయి. కాగా బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేస్తున్న ‘కల్కి’ చిత్రం మూడు రోజుల్లో రూ. 415 కోట్ల వసూళ్లను రాబట్టింది. సినిమా టికెట్ విక్రయ వెబ్‌సైట్ అయిన బుక్ మై షోలో గంటలో 95 వేలకు పైగా ‘కల్కి’ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇది ‘కల్కి’ మరో ఘనత.