బచ్చలమల్లి కోసం ఏదైనా చేయాలనే ఈవెంట్‌కు వచ్చా
అల్లరి నరేశ్ హీరోగా సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘బచ్చలమల్లి’. డిసెంబర్ 20న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నాని మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టీజర్ చూసి నరేశ్‌కు ఫోన్ చేశాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలని ఉందని చెప్పాను. నాకు నేనుగా ఈవెంట్‌కు వచ్చాను’ అన్నారు.
హీరో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. ‘నాకు ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు ఆల్రెడీ హిట్ కొట్టేశాం అనే నమ్మకం ఉంది’ అన్నారు. ‘నాని ఈ ఈవెంట్‌కు రావడంతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టేశాననే ఫీలింగ్ కలుగుతుంది’ అని డైరెక్టర్ సుబ్బు అన్నారు. నిర్మాత రాజేశ్ మాట్లాడుతూ.. “ఈ క్రిస్మస్‌కు ‘బచ్చలమల్లి’ మోత మోగిపోద్ది” అన్నారు. హీరోయిన్ అమృత అయ్యర్, డైరెక్టర్ యోగి, యాక్టర్ అంకిత్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.






