పీపుల్ మీడియా టాలెంట్‌హంట్
16-12-2024 12:42 AM
క్రియేటివ్ ట్యాలెంట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో టేల్‘హంట్ పేరుతో స్టోరీ రైటింగ్ కాంపిటేషన్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. వర్ధమాన కథకులు, ఔత్సాహిక రచయితలకు ఈ ఈవెంట్ ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని ప్రకటించారు.
డ్రామా, కామెడీ, రొమాన్స్, జానపద కథలు, కోర్ట్‌రూమ్ డ్రామాలు, యాక్షన్, ఫాంటసీతో సహా పలు రకాల థీమ్స్‌లో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రభావవంతమైన కథలను రాయగల వారు పోటీలో పాల్గొనాలని ఆహ్వానిస్తు న్నారు. ఎంట్రీలకు చివరి తేదీ డిసెంబర్ 16 అని, మరింత సమాచారం కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా హ్యాండిల్స్ బ్రౌజ్ చేయాలని నిర్వాహకులు కోరారు.






