11-01-2026 01:13:55 AM
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): తనపై ఏమైనా రాసినా తట్టుకుంటా.. కానీ మ హిళా ఐఏఎస్ అధికారులపై ఇష్టమొచ్చినట్టు రాయొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాను కోరారు. మంత్రులు, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, అడ్డగోలు రాతలు మంచివి కాదన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ మహిళా ఐఏఎస్‌పై దుష్ర్పచారం చేయడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
‘మీడియాలో మీరంతా నా పాత మిత్రులే. నా గురించి మీ అందరికీ తెలుసు. అయినా నన్ను ఇలా మానసికంగా హింసిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కొడుకు చనిపోయి నప్పుడే నేను సగం చనిపోయా. అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది. కానీ ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నా. అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇ బ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారు’ అని మంత్రి మీడియాను ఉద్దేశించి ప్ర శ్నించారు.
‘మీ రేటింగ్‌లు, వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు’ అని, ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది సరైనదే అనుకుంటే కంటిన్యూ చేయాలని, ఇంకా సరిపోదు అనుకుంటే ‘నాకింత విషమిచ్చి చంపే యండి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను నా ఫోన్ నంబర్ మార్చానని ఓ చానల్ లో ప్రసా రం చేశారు. ‘ఆ నంబర్ చాలా పాతది.. దాదా పు 20 ఏళ్లకు పైగా ఆ నంబర్ వాడుతున్నా. అందరి వద్ద ఆ నంబర్ ఉండటంతో అందరూ దానికే ఫోన్ చేస్తున్నారు.
దాంతో పీఏ వద్ద ఉంచాను. నాకు గొంతులో అనారోగ్య సమ స్య ఉంది. దాని కోసం అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకున్నా తగ్గడం లేదు’ అని అన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడటమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతానని చెప్పాను. ‘ఆ నంబర్‌తోనే నేను ఆరుసార్లు గెలిచాను. దాన్ని ఎలా పక్కన పెడతా’నన్నారు. ఎంతో కష్టపడితే ఐఏఎస్‌లు అవుతారు. అలాంటి వారిపై ఆఫీసర్ల మీద అభియోగాలు కరెక్ట్ కాదన్నారు. ‘కలెక్టర్ల బదిలీలు సీఎం స్థాయిలో జరుగుతాయి.
నా జిల్లాలోనే కాదు చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగింది. నేను మంత్రిని అయ్యాక నల్గొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారు. మంత్రు లు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రి య జరుగుతుంది’ అని తెలిపారు. సీఎంవోలో ఒక మహిళ అని సీఎంపై కూడా వేశారని, ఇన్‌చార్జ్ మంత్రి మీద కూడా వార్తలు వేస్తున్నారని తెలిపారు. డీజీపీతో ఇలాంటి అంశాలపై చర్చించామని, సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని కోరినట్టు వివరించారు.
డీజీపీ, ఇంటిలి జెంట్ అధికారులకు తప్పుడు వార్తలపై నివేదిక ఇవ్వాలని కోరామని, రిపోర్ట్ వచ్చిన తర్వా త లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. అధికారుల మీద అభాండాలు వేయడం మంచిది కాదన్నారు. ఈ ఆరోపణలపై ప్రభు త్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నానన్నారు. వాస్తవాలు ఉం టే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇప్పటితో ఇలాంటి వార్తలను ప్రచారం చేయ డం మానేయాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని వదులుకున్నానని, పేద ప్రజలకు సేవ చేస్తున్న ‘నాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చెయ్యడం కరెక్ట్ కాదు’ అని స్పష్టం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, ఒక్క రూ పాయి కూడా ఖర్చు పెట్టకుండా రికార్డు స్థాయిలో ఎంపీగా గెలిచానని గుర్తు చేశారు. ‘నాకు దైవ భక్తి ఎక్కువ. నేను దేవుణ్ణి నమ్ము తా. అంతా దేవుడు చూసుకుంటారు’ అని చెప్పారు.