11-01-2026 01:06:56 AM
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు విజ్ఞప్తి చేసిన మాజీమంత్రి మోత్కుపల్లి
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): మాదిగలకు ప్రభుత్వం, పార్టీలో సముచిత భాగస్వామ్యం కల్పించేలా చూడాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ సీనియర్ నాయకులు ముంజగల్ల విజయ్ కుమార్ శనివారం కలిసి కోరారు. మాదిగ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, మాదిగ అమరవీరుల స్తూపాన్ని, మాదిగ భవన్‌ను హైదరాబాద్‌లో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో ఒక సమావేశం ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని మహేశ్ కుమార్‌గౌడ్‌ని మోత్కుపల్లి కోరారు.