calender_icon.png 28 June, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలాంటి కామెంట్స్ నేను చేయలేదు

27-06-2025 12:08:56 AM

‘వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు.. మంచి గుణాలున్న మహిళను వివాహం చేసుకోండి. ఎందుకంటే, వర్జినిటీ అనేది ఒక్క రాత్రితో పోతుంది. కానీ, సభ్యత, సంస్కారం జీవితాంతం ఉంటాయి’ అంటూ ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారంటూ ఇటీవల బాగా ప్రచారం జరిగింది. పురుషులు ఎలాంటి మహిళలను వివాహం చేసుకోవాలనే విషయమై తాను ఈ వ్యాఖ్యలు చేశానంటూ జరుగుతున్న ప్రచారమంతా పూర్తి అబద్ధమని ప్రియాంక చోప్రా క్టొటిపారేసింది.

సామాజిక మాధ్యమాల్లో తన పేరిట వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రియాంక చోప్రా స్పష్టత ఇచ్చింది. ఆ బోల్డ్ కామెంట్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ఈ వ్యాఖ్యలు తాను చేయలేదని పేర్కొంది. “ఇలాంటి కామెంట్స్ నేను చేయలేదు. నేనెక్కడా ఇలా మాట్లాడలేదు. ఈ వార్త సోషల్‌మీడియా సృష్టి మాత్రమే. వైరల్ అయ్యేందుకు ఇలాంటి అసత్య వార్తలు సృష్టించడం ఇప్పుడిలా చేస్తున్నారు. ఇలాంటివి నమ్మే ముందు దయచేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో వచ్చే వార్తలన్నీ నమ్మొద్దు” అని కోరింది.