16 April, 2026 | 11:53 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సంగీత్ సరసన సారిక

27-06-2025 12:07 AM

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రం ప్రారంభమైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు మానసశర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. ఆయన సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇందులో శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తోంది.

‘ఆయ్’, ‘క’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన ‘హలో వరల్డ్’, ‘బెంచ్‌లైఫ్’ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్ ముఖ్య తారాగణంగా ఉన్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్; నిర్మాత: నిహారిక కొణిదెల; స్క్రీన్‌ప్లే;డైలాగ్స్: మహేశ్ ఉప్పాల, మానసశర్మ; కథ మానసశర్మ.