27-06-2025 12:05:44 AM
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. సినిమా జూలై 4న రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న నటి లయ మీడియాతో పంచుకున్న విశేషాలివీ..
- నేను 2023 ‘తమ్ముడు’ టీమ్ నుంచి కాల్ వచ్చిం ది. నేను తీసుకున్న కొన్ని ఫొటోస్ పంపిస్తే, ఈ క్యారెక్టర్‌కు సెట్ అయ్యే లా లేనని చెప్పారు. మళ్లీ ఫొటోషూట్ చేసి పంపమ న్నారు. కొంచెం లావు కావాలని చెప్తే.. స్వీట్స్ తిని బరువు పెరిగా. ఓకే చేశారు.
- అవకాశాలు కోరుకున్నప్పుడు రావు. నా రీఎంట్రీకి సరైన సినిమా అనిపించి, యూఎస్‌లో జాబ్ మానేశా.
- ఇందులో నేను ఝాన్సీ కిరణ్మయి అనే పాత్రలో నటించాను. తనొక స్ట్రిక్ట్ ఆఫీసర్. నా కెరీర్‌లో ఒక సాధారణ అమ్మాయి పాత్రలే చేశా. ఇప్పుడు స్ట్రాంగ్ ఉమెన్‌గా నటించే అవకాశం దక్కింది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది.
- ఈ చిత్రం కోసం అడవిలో షూటింగ్ చేశాం. షూటింగ్ పిక్నిక్‌లా చేశామని చెబుతుంటారు. కానీ మేము పిక్నిక్‌లా చేయలేదు. రోజూ యూనిట్‌లో ఎవరో ఒకరికి గాయాలయ్యేవి. కొన్ని సీన్స్‌లో చెప్పులు వేసుకోలేదు. రాళ్లు కాళ్లకు తగిలేవి. అందరూ సిక్ అయ్యాం. మూవీ బాగా వస్తుందనే సంతోషంలో యూనిటీగా పనిచేశాం.
- నితిన్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ. స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడిలా అందరితో కలిసిపోయారు. ఈ సినిమాలో ఆయన నటన మెచ్యూర్డ్‌గా అనిపిస్తుంది. కష్టమైన సీన్స్ ఈజీగా చేశారు.
- నేను గతంలో సినిమాల్లో నటించినప్పుడు ఆడియో ఫంక్షన్, థియేటర్ విజిటింగ్, 100 డేస్ ఫంక్షన్ ఉండేది. ఇప్పుడు ప్రమోషనల్ ఈవెంట్స్ చాలా చేస్తున్నారు. హీరోయిన్‌గా చేసినప్పుడు సింపుల్‌గానే ఉన్నా. ప్రేక్షకులూ ఓ స్టార్ హీరోయిన్‌గా కాకుండా నా పాత్రల్లాగే నన్ను చూశారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెట్‌లో ఆ తేడా తెలియడంలేదు.
- నేను అనుకోకుండా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా వచ్చా. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మనకంటూ ఏదో సాధించాలనే తపనతో తిరిగి వచ్చా. కథలో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా.
- నేను యూఎస్ ఆర్టిస్టును కాదు.. హైదరాబాద్ లోకల్ ఆర్టిస్టునే. మూవీస్ ఉన్నప్పుడు ఇక్కడే ఉంటా. ప్రస్తుతం శివాజీతో ఒక సినిమా చేస్తున్నా.