శ్రేయాస్‌తో మాట్లాడాను: సూర్యకుమార్ యాదవ్
29-10-2025 12:02 AM
హాస్పిటల్‌లో కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్ హెల్త్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యా దవ్ కూడా స్పందించాడు. శ్రేయాస్ ప్రస్తు తం క్షేమంగానే ఉన్నాడని, తాను ఫోన్‌లో మాట్లాడినట్టు సూర్య చెప్పాడు. ఆసీస్‌తో తొలి టీ ట్వంటీ సందర్భంగా జరిగిన ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ ఈ వివరాలు వెల్లడించాడు. ఫోన్‌లో మాట్లాడు తుంటే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టే కదా అని వ్యాఖ్యానించాడు. కొన్ని రోజులు తమ మెడికల్ టీమ్ పర్యవేక్షణలోనే శ్రేయాస్ ఉంటా డని చెప్పుకొచ్చాడు. పూర్తిగా కోలుకుని త్వరలోనే మైదానంలో అడుగుపెడతాడని సూర్యకుమార్ ఆకాంక్షించాడు.




