స్మృతి మంధానకు కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్
దుబాయి, అక్టోబర్ 28: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భార త స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఆధిపత్యం కొనసాగుతోంది. మెగా టోర్నీలో వరుస హాఫ్ సెంచరీలతో దుమ్మురేపుతున్న స్మృతి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌లోనే బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించింది. తాజాగా విడుదలైన జాబితాలో ఆమె 828 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసు కుంది. రెండో ర్యాంకులో ఉన్న గార్డనర్‌కు, ఆమెకూ మధ్య 97 పాయింట్ల తేడా ఉంది.
వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్, సౌతాఫ్రికా జట్లపై వరుస హాఫ్ సెంచరీలు చేసిన స్మృతి తర్వాత కివీస్‌పై శతక్కొట్టింది. ప్రస్తుతం టోర్నీలో ఆమె 365 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది. అయితే వన్డే ర్యాంకిం గ్స్ టాప్ మరే భారత బ్యాటర్‌కు చోటు దక్కలేదు. హర్మన్ ప్రీత్ కౌర్ 18వ ర్యాంకులోనూ, జెమీమా 19వ స్థానంలోనూ నిలిచారు. కివీస్‌పై సెంచరీ చేసిన ప్రతీకా రావల్ 12 స్థానాలు మెరుగై 27వ ర్యాంకులో నిలిచింది.




