వేగంగా కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్
సిడ్నీ, అక్టోబర్ 28: భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటున్నాడు. సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ ఐసీయూలో చేరడంతో అందరిలోనీ ఆందోళన నెలకొంది. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో కిందపడిపోవడంతో అతని పక్కటెముకలు నేలను బలంగా తాకా యి. దీంతో అతని ప్లీహానికి గాయమైంది. అంతర్గతంగా రక్తస్రావం కావడాన్ని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.
సకాలంలో గుర్తించి ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో జనరల్ వార్డుకు మార్చా రు. తాజాగా శ్రేయాస్ ఆరోగ్యానికి సంబంధించి బీసీసీఐ రెండోసారి ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం శ్రేయాస్ వేగం గా కోలుకుంటున్నట్టు తెలిపింది. తాజాగా మరోసారి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారని, గాయం తీవ్రత తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. సిడ్నీ హాస్పిటల్‌లోనే బీసీసీఐ మెడికల్ టీమ్ కూడా అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందని బీసీసీఐ తెలిపింది. శ్రేయాస్‌కు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నట్టు బీసీ సీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా చెప్పారు.




