26 July, 2026 | 12:23 AM

రోజూ నా క్యారెక్టర్‌లోనే ఉండిపోయేవాడ్ని

21-11-2024 12:00 AM

మెగా సూపర్ గుడ్ ఫిలింస్ రూపొందించిన కొత్త చిత్రం ‘తల’. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మాతలు. ఈ చిత్రం తో అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్‌రాజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. త్వరలో థియేటర్ల ద్వారా విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

కార్యక్రమంలో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. “నేను నా కెరీర్‌లో దేవుడిగా భావించేది ఆర్‌బీ చౌదరిని. ఇప్పుడు ఆయన నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్‌రాజ్‌ని హీరోగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది” అన్నారు. హీరో రాగిన్‌రాజ్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులే నాకు అన్నీ.

నేను ఎలా ఉండాలని వాళ్లు కోరుకుంటారో అలా ఉంటా. నాన్న ఈ మూవీ కథ చెప్పినప్పట్నుంచీ రోజూ నా క్యారెక్టర్‌లోనే ఉండిపోయేవాడ్ని’ అని తెలిపాడు. నటి ఎస్తేర్ మాట్లాడుతూ.. “తల’ మూవీలో నా క్యారెక్టర్ ఇప్పటిదాకా నేను నటించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది” అన్నారు. నటుడు రోహిత్, ఎడిటర్ శివ శర్వాణి తదితరులు పాల్గొన్నారు.