7 April, 2026 | 9:31 PM

మల్లన్నసాగర్ నిర్వాసితుల గోస తీరుస్తా..

10-02-2026 01:31 AM

౧౨వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి దామరంచ దయాకర్ రెడ్డి 

గజ్వేల్, ఫిబ్రవరి9: ఉన్న భూములు కోల్పోయి, ప్యాకేజీలు ప్లాట్లు రాక ఇబ్బందులు పడుతున్న ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రజల కష్టాలను తీరుస్తానని ౧౨వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి దా మరంచ దయాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల నుండి ఓటు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామ ప్రజల ప్యాకేజీలు ప్లాట్లు రావాలంటే తనను గెలిపించాలని కోరారు. ప్రభుత్వంతో పోరాడి ప్యాకేజీలు సాధిస్తామన్నారు. ప్రజలంతా ఓటు వేసి తనకు అండగా ఉంటే ౧౨వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.