7 April, 2026 | 11:28 PM

18వ వార్డులో గెలుపు బీఆర్‌ఎస్‌దే..

10-02-2026 01:30 AM

గజ్వేల్, ఫిబ్రవరి 9 : మాజీ సీఎం కేసీఆర్  అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా సం తోషంగా ఉన్నారని, అభివృద్ధిని కోరుకుంటున్న 18వ వార్డు ప్రజలు బిఆర్‌ఎస్ ని గెలిపిస్తారని మాజీ ఎంపీపీ దాసరి అమరావతి శ్యామ్ మనోహర్, మాజీ కౌన్సిలర్ రహీంలు అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 18 వ వార్డు కౌన్సిలర్  బీఆర్‌ఎస్ అభ్యర్థి మామిడి శ్రీధర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచారంలో ఓటర్ అభ్యర్థుల నుంచి పెద్ద ఎ త్తున మద్దతు తెలుపుతున్నారని, కెసిఆర్ గజ్వేల్ పట్టణంలో చేసిన అభివృద్ధి పనులు టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడంతోపాటు చైర్మన్ పదవి కూడా లభిస్తుందని ఈ సందర్భంగా వారన్నారు. కార్యక్రమంలో  బిఆర్‌ఎస్ నాయకులు విజయ్, సమియోద్దీన్ కార్యకర్తలు పాల్గొన్నారు.