17 July, 2026 | 1:15 AM

జర్నలిస్టు పాత్రలో కనిపిస్తా

03-12-2024 02:46 AM

యూఎస్‌ఏకు చెందిన జో శర్మ కథానాయకిగా తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రం ‘ఎం4ఎం’ (మోటివ్ ఫర్ మర్డర్). సంబీత్ ఆచార్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, సత్యకృష్ణ, పసునూరి శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతోందీ సస్పెన్స్ థ్రిల్లర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 5 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ జో శర్మ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. ‘నేను ఇందులో ఇన్విస్టిగేషన్ జర్నలిస్టుగా చేశాను. క్షణక్షణం ఉత్కంఠతో నడిచే ఈ సినిమా ఇది’ అన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘వరల్డ్‌వైడ్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో తెరకెక్కించాం. విడుదలైన మొదటి రోజు ఈ సినిమా చూసి, ఇందులో కిల్లర్ ఎవరో ఊహించి చేస్తే ఒక్కొక్కరికి రూ.లక్ష బహుమతిగా ఇస్తాం’ అని తెలిపారు.