17 July, 2026 | 1:02 AM

మోడ్రన్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తూ

03-12-2024 02:52 AM

చిట్టిపొట్టి మోడ్రన్ దుస్తులతో మెస్మరైజ్ చేసే ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడి టైం నడుస్తోంది. ‘స్త్రీ 2’ చిత్రంతో మంచి హిట్ కొట్టిన శ్రద్దా కపూర్ ఆ తరువాత నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు గ్లామర్‌కు కేరాఫ్‌లా ఉంటారు. అందుకే వాళ్లకు అంత క్రేజ్. శ్రద్ధా కపూర్‌కి అవకాశం ఏదో ఒక రూపంలో తలుపు తడుతూనే ఉంది. ఇప్పుడిది వార్త కాదు.

అమ్మడి పోస్టర్ హాట్ టాపిక్. బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘వార్ 2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రద్దాకు స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడే అవకాశం వచ్చిందని సమాచారం. ఒక్కరితో కాదు.. ఇద్దరు స్టార్ హీరోలతో ఆడి పాడనున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో ఈ ముద్దుగుమ్మ స్టెప్పులేయనున్నారట. ఇది తెలిసిన విషయమే అయినా కూడా ఆమె పెద్ద మొత్తంలో ఈ సాంగ్ చేయడానికి పారితోషికం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

మరి ఇద్దరు స్టార్ హీరోలతో డ్యాన్స్ అంటే పారితోషికం గట్టిగానే ఉంటుంది. ఇక తాజాగా శ్రద్దా గ్లామర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ‘వార్ 2’ స్పెషల్ పిక్ అని చెబుతున్నారు. మొత్తానికి అమ్మడు బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో యూత్‌కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు.