13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుంటా..

31-03-2026 01:14 AM

డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్, మార్చి30(విజయక్రాంతి): ప్రజాసమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోట నీలిమ అన్నారు. బన్సీలాల్ పేట్ డివిజన్ సీసీ నగర్‌లో ఆమె పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ పాదయాత్ర చేసి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరుపై చర్చించారు.

సీనియర్ నేతలు పాండు గౌడ్, నారాయణ, రాజశేఖర్, ఎంపీ సునీల్, కృష్ణ ఆధ్వర్యంలో కొత్తగా రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ పొందిన లబ్ధి దారులను కలిసి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.