కుటుంబ వ్యవహారం.. రాజకీయం చేయొద్దు!
- వట్టినాగులపల్లి భూవివాదంతో మంత్రి పొంగులేటి కుటుంబానికి సంబంధం లేదు
- కేటీఆర్, హరీశ్‌రావుల ఆరోపణలు తగదు
- భూ యజమానులు
పంజాగుట్ట, మార్చి 30 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్ 259, 245లలో జరు గుతున్న భూ వివాదం కేవలం ఒకే కుటుంబానికి చెందిన అంతర్గత సరిహద్దు తగాదా అని, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని భూ యజమానులు స్పష్టం చేశారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో భూ యజమానులు అవినవ్ షా, సుధీర్ కుమా ర్ షా, అక్షయ్ షా, న్యూజెన్ డెవలపర్స్ ఎండీ సిద్ధార్థ గాదె వాస్తవాలను వెల్లడించారు. ఈ వివాదంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గానీ, ఆయన కు టుంబ సభ్యులకుగానీ ఎటువంటి సంబం ధం లేదని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు కేవలం ఒకవైపు వాదన మాత్రమే విని ఆరోపణలు చేయడం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత పదేళ్లుగా తన తండ్రి సమానులైన సతీష్ షా సలహాతోనే తాము నడుచుకుంటున్నామని, ఇది పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదమే తప్పా ఆక్రమణలు కావ ని వివరించారు. ఈ భూమి విలువ రూ.1,200 కోట్లు అని కేటీఆర్ చెపుతున్నారని, ఒకవేళ అదే నిజమైతే తాము రూ.600 కోట్లకే కేటీఆర్‌కు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
ఈ భూ వివా దం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నదని, కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా సతీష్ షా అక్కడ గోడ నిర్మించడంపైనే తాము అభ్యంతరం తెలిపామని వివరించారు. కబ్జాలు జరగలేదని, కేవ లం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సరిహద్దు సమస్యను అనవస రంగా జఠిలం చేస్తున్నారని చెప్పారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు తాము ఎటువంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇవ్వలేదని, కేవలం న్యూజెన్ కంపెనీతోనే ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
న్యూజెన్ డెవలపర్స్ ఎండీ సిద్ధార్థ గాదె మాట్లాడుతూ, .. తమ సంస్థలో పొంగులేటి హర్ష ఒక పార్టనర్ మాత్రమేనని, ఆయన పేరును ప్రస్తావిస్తూ మంత్రికి అక్రమాలు ఆపాదించడం సరికాదని అన్నా రు. భువన్ యాప్ ద్వారా లేదా ఏడీ సర్వే, శాటిలైట్ సర్వే చేయిస్తే ఎవ రి భూమి ఎక్కడ ఉందో స్పష్టంగా తెలుస్తుందని వివరించారు.
1969 నుంచి ఈ ఆస్తి తమ కుటుంబం మధ్యే ఉందని, సర్వే నంబర్లు 259, 245, 262లలో రీ-సర్వే చేయిస్తే ఎక్కువ ఉన్న వా రు వదులుకోవడానికి, తక్కువ ఉన్నవారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము అన్ని ఆధారాలను మీడియా ముందు ఉంచుతున్నామని, కేటీఆర్ స్వ యంగా వీటిని పరిశీలించి ప్రజాకోర్టులో న్యాయం చెప్పాలని కోరారు.




