15 April, 2026 | 6:33 AM

బీసీ మంత్రిత్వ శాఖ కోసం ఒత్తిడి తెస్తా..

06-01-2026 12:00 AM

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి):  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తు న్నా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపో వడం బాధాకరం అని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. కేంద్రం లో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ కోసం ప్రభు త్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్. కృష్ణయ్య పాల్గొని ఈ నెల 9న వరంగల్ లో తలపెట్టిన బీసీ విద్యుత్ ఉద్యోగుల 20వ మహా సభల గోడ పత్రికను సంఘం నేతలతో కలసి ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. నూతన పెన్షన్ స్కీమ్ కారణంగా ఉద్యో గులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి తక్షణ మే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయా లన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్ ఇస్తు న్నారని, కానీ తమ జీవితం మొత్తం ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక ఉద్యోగులకు భరోసా లేకుండా పోయిందని అన్నారు.

విద్యుత్ సంస్థ ల్లో 24 వేల మంది ఉద్యోగులు ఆర్టిజన్లుగా కొనసాగుతున్నారని, వీరి రెగ్యులర్ చెయ్యా లని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి మాట్లాడుతూ ఈ మహాస భలకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొనను న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగు ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి  వెంకన్న గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్ పాల్గొన్నారు.