calender_icon.png 9 January, 2026 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు స్నేహ భావాన్ని పెంచుతాయి: కమాండెంట్

06-01-2026 12:00:00 AM

నల్గొండ క్రైమ్, జనవరి 5: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నేపర్తి 12వ బెటాలియన్ కమాండెంట్ వీరయ్య అన్నారు సోమవారం బెటాలియన్ లో ఇంటర్ కంపెనీ 2026 స్పోరట్స్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పోలీస్ సిబ్బంది ఉద్యోగ పరంగా ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించడంలో క్రీడా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

ఈ ఆటల ద్వారా సిబ్బందిలో ఉత్సాహం, స్ఫూర్తి పెరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు తనను ఎంతగానో ఆకర్షించిందని తెలిపారు. పోలీస్ సిబ్బంది క్రీడా స్ఫూర్తితో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయ మన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సిహెచ్. ఆంజనేయ రెడ్డి, నర్సింగ్ వెంకన్న, ఏవో అతీక్ ఉర్ రహమాన్, యూనిట్ హాస్పిటల్ షర్మిలా దేవి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, మినిస్టీరియల్ స్టాఫ్, తదితరులు పాల్గొన్నారు.