10 August, 2026 | 3:48 AM

గ్రామాల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తా..

10-08-2026 12:42 AM

మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి

షాద్‌నగర్, ఆగస్టు 9 (విజయక్రాంతి):  కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామంలో ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మక్తగూడ  గ్రామంలో ప్రజలకు రాత్రి సమయాల్లో సురక్షితంగా రాకపోకలు సాగించాలని ఉద్దేశంతోనే ఈ ఐమాక్స్ లైటింగ్ ను ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.

గ్రామంలో నూతన ఐమాక్స్లైట్లతో జిగేల్ జిగేల్ మనిపించింది.అలాగే కొత్తూరు మండలంలోని పలు గ్రామాలకు  సొంత నిధులతో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బోకుల శ్రీరాములు,చిట్టెడి  నరసింహారెడ్డి,మీనాక్షి దశరత్ నాయక్,మాజీ సర్పంచులు కట్న రాజు,రవి నాయక్, ఉప సర్పంచ్ రాములు గౌడ్,శంకర్ నాయక్,వార్డ్ సభ్యులు బోకుల రాజు, తదితరులు పాల్గొన్నారు.