కాంగ్రెస్ బలోపేతంపై సమావేశం
పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మినిస్టర్ క్వార్టర్స్లోని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నివాసంలో నిర్వహించిన సమావేశంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. బీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతి, బీసీల ఆర్థిక అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల పూర్తి తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో బీసీ మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, బీసీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, వి. హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ జూమ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు.






