10 August, 2026 | 5:00 AM

‘కాసు’కు రాఘవేందర్‌రెడ్డి పరామర్శ

10-08-2026 12:40 AM

తలకొండపల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): మండలంలోని లింగారావుపల్లి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి సీతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదివారం రామకృష్ణాపురం లోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, సంజీవరెడ్డి, జగన్ రెడ్డి, అంజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, బొచ్చుపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.