15 August, 2026 | 2:50 AM

బహుజనుల హక్కుల కోసం కృషి చేస్తా..

15-08-2026 01:35 AM

కల్లూరు, ఆగస్టు 14 (విజయక్రాంతి): బహుజన సమాజ్ పార్టీ (బి ఎస్ పి ) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జిగా బి ఎస్ పి సెంట్రల్ సెక్టర్ కోఆర్డినేటర్ లు అత్తర్ సింగ్ రావు,సురేష్ ఆర్య లు మండల పరిధిలోని చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన నామా విజయ్ ని నియమించగా రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ నియమాక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ ఇన్చార్జిగా నియమితులైన నామ విజయ్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బహుజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాల ప్రజలకు సామాజిక,ఆర్థిక,రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలన్న బి ఎస్ పి లక్ష్యానికి కట్టుబడి ఉంటానని అన్నారు.మహనీయులు బి ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కాన్షీరాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.