మారుతీ నగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
బడంగ్‌పేట్, జూన్ 14 (విజయక్రాంతి ): బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మారుతీ నగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల దుస్థితిని త్వరలోనే పరిష్కరిస్తామని ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. స్థానికుల ఆహ్వానం మేరకు ఆదివారం ఆయన కాలనీలో పర్యటించారు. ప్రజల సమస్యలను విన్న ఆయన, వెంటనే మున్సిపల్ ఏఈ హరీష్ను అక్కడికి రప్పించి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు.ఈ సందర్భంగా ఏఈ హరీష్ మాట్లాడుతూ..
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కొత్తగా సాంక్షన్ మంజూరు చేసి, వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీ సమస్యలను నియోజకవర్గ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి మరియు శంషాబాద్ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ లింగం యాదవ్, కమిటీ సభ్యులు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






