26 April, 2026 | 2:21 AM

సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా

26-04-2026 12:00 AM

టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : లింగోజిగూడ డివిజన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీలో ఇంటి నిర్మాణ అనుమతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు.  గ్రీన్ పార్క్ కాలనీ అధ్యక్షుడు జగన్ రెడ్డితో పాటు స్థానికులతో వెళ్లి ఎల్బీనగర్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ ని గమర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న హౌసింగ్ పర్మిషన్  సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి  చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బండ్ బౌండరీ బైట  నిర్మాణాలకు సరైన విధంగా పర్మిషన్లు ఇస్తే ప్రభు త్వానికి ఫీజుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని, అనధికార నిర్మాణాలు తగ్గి క్రమబద్ధమైన అభివృద్ధి సాధ్యమ వుతుంద ని తెలిపారు. గ్రీన్ పార్క్ కాలనీ ప్రజల సమస్యల పరిష్కారానికి తాను కట్టుబడి ఉన్నాన ని, త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.