26 April, 2026 | 2:24 AM

కళలు వికసిస్తే సంస్కృతి వికసిస్తుంది

26-04-2026 12:00 AM

చార్కోల్ స్టోరీస్ ప్రదర్శనలో సినీ దర్శకుడు బీ నర్సింగ్‌రావు

ముషీరాబాద్,ఏప్రిల్ 25(విజయక్రాంతి) : నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన బాల ప్రతిభాశాలి రిక్కీ తేజ్ రూపొందించిన ’చార్కోల్ స్టోరీస్’ కళా ప్రదర్శనను హైదరాబాద్లోని లమాకాన్ వేదికగా ప్రముఖ సినీ దర్శకుడు, చిత్రకారుడు బి.నర్సింగ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిక్కీ తేజ్లోని అసాధారణ ప్రతిభను కొనియాడుతూ ముఖ్యంగా పౌరాణిక అంశాలపై అతను చూపిస్తున్న సహజసిద్ధమైన, జీవం తో నిండిన చార్కోల్ చిత్రాలను ప్రశంసించారు. విద్యార్థులు నృత్యం, మట్టి కళలు, సంగీతం, క్రీడలు, ఇతర సృజనాత్మక, సహపాఠ్య కార్యకలాపాలను అభ్యసించాలని సూచించారు. తెలంగాణను కళల పుట్టినిల్లు అని ఇలాంటి ప్రతిభను ప్రోత్సహించడంలో రాష్ట్రం ముందుంటుందని తెలిపారు.

పిల్లలు స్వేచ్ఛగా తమ సృజనాత్మకతను వ్యక్తపరచుకునేలా అవకాశం ఇవ్వాలని, అలా చేస్తేనే వారు కళల్లో రాణిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు వెంకటేశ్వరరావు, కార్టూనిస్ట్ నర్సింహా, గ్రూప్-1 అధికారి సాహితి, తుమ్మలపల్లి యూపీఎస్ ప్రధానోపాధ్యాయులు వేముల సైదులు, రిక్కీ తేజ్ తండ్రి కట్టా కోటేశ్వరరావు, రాజ్యలత, రాజే ష్, శ్రీధర్ పాల్గొని రిక్కీ తేజ్ కళా ప్రతిభ, సామాజిక స్పృహ, విద్య, క్రీడలలో అతని ప్రతిభను ప్రశంసించారు. ఈ ప్రదర్శన ఏప్రి ల్ 26 సాయంత్రం 6 వరకు వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని బాలచెలిమి చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ, హైదరాబాద్ మేనేజర్ ఖైజర్ బాషా తెలిపారు.