6 August, 2026 | 2:32 AM

విశాఖలో ఐబీఎం ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రారంభం

06-08-2026 12:00 AM

విశాఖపట్నం, ఆగస్టు 5 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఐబీఎం తన కొత్త కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్‌ను విశాఖలో ప్రారంభించింది. ప్ర పంచ వ్యాప్తంగా ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేష న్ సేవలకు మద్ధతుగా నిలిచేందుకు ఈ కేం ద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ ఐటీ శాఖ మం త్రి నారా లోకేశ్, ఐబీఎం ఇండియా, సౌత్ ఏషియా ఎండీ సందీప్ పటేల్‌తో కలిసి దీనిని ప్రారంభించారు.ఈ ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐబీఎం వినియోగదారుల కు కన్సల్టింగ్ సేవలు, ఏఐ ఫస్ట్ ట్రాన్స్‌ఫర్మేష న్ ప్రాజెక్టులకు మద్ధతు అందిస్తుంది.

ఏఐ హైబ్రిడ్ క్లౌడ్, ఫ్లాట్‌ఫాం ఇంజనీరింగ్, సర్వీస్ ఇంటిగ్రేషన్, నాణ్యమైన ఇంజనీరింగ్,యూజర్ ఎక్స్‌పీరియన్స్ సేవలకు కేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది.  ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థ ఏఐ, డిజిటల్ సేవలను దృష్టిలో ఉంచుకుని విశాఖలో ఫ్యూచర్ నౌ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఏపీ ఐటీ శాఖ మంత్రి  నారా లోకేశ్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో తాము కూడా భాగమవుతుండడం గర్వంగా ఉందని ఐబీఎం ఇండియా, సౌత్ ఏషియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు.