calender_icon.png 16 November, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రేకింగ్ న్యూస్.. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ క్లోజ్

16-11-2025 01:48:28 PM

హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూకట్ పల్లిలోని రవి అపార్టుమెంట్లో పోలీసులు సోదాలు చేసి రూ.3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్ లు, ల్యాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. రవికి ఎలాంటి సర్వర్ ను అయినా ఈజీగా హ్యాక్ చేయగలిగే టాలెంట్ ఉంది. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ను సైతం హ్యాక్ చేసిన ఇమ్మడి రవి కొత్త సినిమాలు డౌన్ లోడ్ చేసి కరేబియన్ దీవులే అడ్డాగా చేసుకొని ఐ-బొమ్మలో అప్ లోడ్ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తీసుకున్నాడు.

దీంతో ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లకు సైబర్ క్రైమ్ పోలీసులు తెరదించారు. నిర్వాహకుడు రవితో ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్ సర్వర్లు క్లోజ్ చేయించారు. రవి సవాల్ ను స్వీకరించి, అతనితోనే వెబ్ సైటు క్లోజ్ చేయించినట్లు పోలీసులు వివరించారు. ఐబొమ్మ పేరుతో 70కి పైగా మిర్రర్ సైట్లు,  ఐబొమ్మ, బప్పం, ఐరాధ పేర్లతో ప్రధాన వెబ్ సైట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందని, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను వివిధ డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తున్నాడు. నిందితుడి రవి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లను పోలీసులు విశ్లేషించిన సైబర్ క్రైమ్ అతడిని కస్టడీకి కోరుతూ సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.