11 May, 2026 | 8:44 PM

Breaking News

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి   •   ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన శివానికి సీఎం చేతుల మీదుగా ల్యాప్‌టాప్ ప్రదానం   •   కాసిపేట గనిని సందర్శించిన జీఎం రాధాకృష్ణ   •   ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆర్డిఓ సుబ్రహ్మణ్యం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •  

బంగ్లా బోర్డుకు కొత్త అధ్యక్షుడు

23-08-2024 12:00 AM

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ ఫరూఖ్ అహ్మద్ ఎన్నికయ్యారు. ఇన్ని రోజులు అధ్యక్షుడిగా వ్యవహరించిన హసన్ స్థానంలో 58 సంవత్సరాల అహ్మద్ ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు నజ్ముల్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. నజ్ముల్ అధికారం కోల్పోయిన అవామీ లీగ్ ఎంపీగా 2009 నుంచి కొనసాగుతున్నారు. ‘గతంలో విధానాలు నచ్చక సెలెక్టర్‌గా రాజీనామా చేశా. కానీ ప్రస్తుతం పనులన్నీ సాఫీగా సాగే వ్యవస్థను ఏర్పాటు చేస్తా’ అని కొత్త ప్రెసిడెంట్ మీడియాతో అన్నారు.