తాటిపండు.. పోషకాలు మెండు
శరీరానికి కావలసిన పోషకాలను అందించే పండ్లల్లో తాటి ముంజలు కూడా ఒకటి. వేసవిలో మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే వీటిని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. వీటిని కన్నడలో తాటి నుంగు, తమిళంలో నుంగు, మలయాళంలో యెంగు అని అంటారు. తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటాయి.
కాబట్టి వేసవిలో చలువ కోసం తాటిముంజల్ని తినడం చాలా అవసరం. నీటి శాతం అధికంగా ఉండే వీటిని తింటే డీహైడ్రేట్ సమస్య నుంచి బయటపడవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బీ, ఐరన్, క్యాల్షియం శరీరానికి అవసరం. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని తాటి ముంజలు నిర్మూలిస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని సమతుల్యం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.
కామిడి సతీష్ రెడ్డి, 9848445134






