12 July, 2026 | 2:37 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ఐడీబీఐ బ్యాంక్ నికరాభం 44 శాతం వృద్ధి

05-05-2024 12:35 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఐడీబీఐ బ్యాంక్  స్టాండెలోన్ నికరలాభం మార్చి త్రైమాసికంలో భారీగా 44 శాతం వృద్ధిచెంది రూ. 1,628 కోట్లకు చేరింది. బ్యాంక్ నికరవడ్డీ ఆదాయం రూ.12 శాతం ఎగిసి రూ.3,688 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 6.38 శాతం నుంచి 4.53 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏలు 0.92 శాతం నుంచి 0.32 శాతానికి దిగివచ్చాయి. 2024 మార్చి 31నాటికి ప్రొవిజన్ కవరేజ్ రేషియో (పీసీఆర్) 99.09 శాతానికి చేరినట్లు బ్యాంక్ తెలిపింది. మొత్తం డిపాజిట్లు రూ.2,77,657 కోట్లకు పెరిగాయని, కాసా డిపాజిట్లు రూ.1,40,027 కోట్లకు పెరిగాయని, కాసా రేషియో 50.43 శాతం ఉన్నదని బ్యాంక్ వివరించింది. బ్యాంక్ నికర అడ్వాన్సులు 16 శాతం వృద్ధితో రూ.1,88,621 కోట్లకు పెరిగాయి. అయితే డిపాజిట్లపై వ్యయం 3.71 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగింది. షేర్‌హోల్డర్లకు షేరుకు రూ.1.50 చొప్పున డివిడెండును బ్యాంక్ ప్రకటించింది. ఏజీఎంలో షేర్‌హోల్డర్ల అనుమతి తర్వాత డివిడెండును చెల్లిస్తారు.