7 April, 2026 | 2:24 AM

ఎంఎస్‌ఎంఈ హాకథాన్ 5.0లో రూ.12 లక్షల గ్రాంట్‌తో జిట్స్ విద్యార్థిని ఎంపిక

07-04-2026 12:09 AM

మనకొండూర్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్)కు చెందిన IV బి.టెక్ (ఈసీఈ) విద్యార్థిని పెర్కారి శ్రీ చందన ప్రతిష్టాత్మకమైన ఎం ఎస్ ఎం ఈ హాకథాన్ 5.0 లో ఎంపిక కావడం విశేషం. ఆమె రూపొందించిన రెండు చక్రాల వాహనదారుల భద్రత కోసం స్మార్ట్ వేరబుల్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ అనే ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి 12 లక్షల గ్రాంట్ మం జూరు చేయబడింది.

ఈ విజయంతో సంస్థలో విద్యార్థులలో ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలు, పరిశోధనా సామర్థ్యాలు మరింత వెలుగులోకి వచ్చాయి.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జె. సాగర్ రావు, సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ జె. సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డా. టి. అనిల్ కుమార్, డీన్ అకాడెమిక్స్ & ఆడిట్ డా. పి. కే. వైశాలి విద్యార్థినిని అభినందించారు. ఆమె సాధనకు ప్రశంసలు తెలియజేసి, ఇలాంటి జాతీయ స్థాయి పోటీలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.