calender_icon.png 5 November, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ సమస్య బాధిస్తే..

08-10-2024 12:00:00 AM

ఉపవాసం ఉన్నవారు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యుల పరిశీలనలో తేలింది. ఆహారం తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. దీనికి చాలా కారణాలున్నాయి. గ్యాస్ట్రిక్ సమస్య నేరుగా అన్నవాహిక శ్లేష్మ పొరపై ప్రభావం పడేలా చేస్తుంది. దాంతో గుండెల్లో మంట వస్తుంది. ఉపవాస సమయంలో పుష్కలంగా నీరు, జ్యూస్ బాగా తాగాలి.

నీరు అధికంగా ఉండే పండ్లు, పుచ్చకాయలను తినండి. సహజ చక్కెర ఉన్న ఉన్న మజ్జిగ, గోరువెచ్చని పాలు తీసుకోవాలి. ఇవి జీర్ణవ్యవస్థను మంచిగా ఉంచుతాయి. గోరువెచ్చని నీరు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మీ ఉపవాసాన్ని విరమించుకునేటప్పుడు బాదం, తేలికగా జీర్ణమయ్యే, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.