25 May, 2026 | 8:36 PM

తప్పు చేయకుంటే కమిషన్ ముందు హాజరవ్వండి

17-06-2024 12:10 AM

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరితేనే విచారణ కమిటీ

కేసీఆర్ లేఖపై డిప్యూటీ సీఎం భట్టి మండిపాటు

ఖమ్మం , జూన్ 16 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ తప్పు చేయనప్పు డు విచారణ కమిషన్ ఎదుట హాజరైతే నష్టం ఏంటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు.  ఆదివారం ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరైన భట్టి కేసీఆర్ లేఖపై స్పందించారు. అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కోరడంతోనే గత ప్రభుత్వంలోని విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలపై కమిషన్ ఏర్పాటు చేశామని స్పష్టంచేశారు. గతంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సైతం కమిషన్ ముందు హాజరయ్యారని గుర్తు చేశారు.  తప్పు చేయనప్పుడు కేసీఆర్ కమిషన్ ముందు దర్యాప్తుకు హాజరు కావడానికి వచ్చిన సమస్య ఏంటని నిలదీశారు.