calender_icon.png 24 September, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్లు పెంచకపోతే సర్కారును కూల్చేస్తారు

24-09-2025 12:00:00 AM

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 

మునుగోడు, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీలు ఇచ్చిన పెన్షన్ దారుల పెన్షన్లను అమలు వర్షకపోతే సర్కార్ని పూలుస్తారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మంగళవారం విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మత్స్యగిరి అధ్యక్షతన ఏర్పాటుచేసిన మునుగోడు నియోజకవర్గ చేయూత పెన్షన్ దారుల సన్నహాక సభకు ఆయన హాజరై మాట్లాడారు.

చేయుత పెన్షన్లు పెంచకుండా రేవంత్ రెడ్డి మోసం చేశాడు అని అన్నారు.2023 ఎన్నికలలో నవంబర్ లో నాకు ఓటు వేయండి డిసెంబర్ లో పెరిగే పెన్షన్లు తీసుకోమని మాట్లాడిన రేవంత్ రెడ్డి.... ఓట్లు దండుకున్నాక  దారుణంగా మోసం చేశాడని పేర్కొన్నారు. చేతగాని స్థితిలో ఉన్న పెన్షన్ దారులకు న్యాయం చేయాలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థుడిగా మిగిలిపోతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో  విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు తలారి సహదేవులు, మేతరి రాములు, డ్యూటీ శోభ, ఆవుల లింగయ్య,మేడి శంకర్,ఎరిగి శ్రీశైలం,ఎర్రసాని గోపాల్,బకరం శ్రీనివాస్, పందుల అంజయ్య,పందుల వెంకన్న,పందుల మల్లేష్, పందుల సంపత్, బోయపర్తి యాదయ్య ఉన్నారు.