calender_icon.png 24 September, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

24-09-2025 12:00:00 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, సెప్టెంబర్  (విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సోన్ మండల కేంద్రం లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో మార్క్ అవుట్, బేస్ మెంట్, తదనంతర నిర్మాణ దశలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ నెల 30లోపు అనుమతులు పొందిన అన్ని ఇళ్లకు మార్కౌట్ ప్రక్రియ పూర్తి చేసి, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యద ర్శులు నిరంతరం ఇళ్ల నిర్మాణంపై పర్యవేక్షణ చేయాలని, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయా లని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కలెక్టర్, నిబంధనల ప్రకారం ప్రతి దశకు సంబంధించిన ఫొటోలు సంబంధిత వ్బుసైట్లో సమయానికి అప్లోడ్ చేయాలని చెప్పారు. 

జిల్లా స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి వివరాలను కలెక్టర్ వెల్లడిస్తూ, తెలంగాణ ప్రభుత్వం పేదలకు గృహాలు కల్పిం చేందుకు ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 9,161 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.(ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, పీవీటీజీలకు ప్రత్యేకంగా) ఇందులో 60 శాంతం మార్క్ అవుట్లు పూర్తవగా, 50 శాతం పైగా ఇళ్లు బేస్మెంట్ స్థాయి వరకు వచ్చాయని తెలిపారు.

ఇప్పటివరకు 24 కోట్ల 68 లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. అదనపు ఆర్థిక సహాయం కావలసిన వారికి స్వయం సహాయక సంఘాలు   రుణాలు అందిస్తున్నామ న్నారు ఇల్లు పూర్తి అయిన వారికి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఎంపీడీవో సురేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.