బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేం
కలెక్టర్‌కు బిల్డర్స్ అసోసియేషన్ నేతల వినతి
ఆదిలాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి బిల్లులు ఏండ్లుగా పేరుకుపోతున్నాయని బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేమని బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏం. రామారావు అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ రాజర్షిషాతో పాటు పంచాయతీ రాజ్ ఎస్.ఈ జాదవ్ ప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు.
బిల్లులు రాకపోవడం మూలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని మిగిలిన పనులు చేయలేని పరిస్థితి ఉందని కలెక్టర్ కు వివరించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు గుట్ట నవీన్, ఎస్. కృష్ణారావు, గాజుల సదానంద్, లింగా రెడ్డి, శ్రీదర్ రెడ్డి తదితరులు ఉన్నారు.




