calender_icon.png 5 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి

05-11-2025 01:10:10 AM

కుమ్రం భీం అసిఫాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి):ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి  ఎస్జిఎఫ్  అండర్17 బాలుర కబడ్డీ జోనల్ పోటీలలో జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల జట్లు పాల్గొన్నగా  ఈ పోటీల్లో ఆసిఫాబాద్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేత లుగా నిలిచారు.

విజేత జట్టును అభినందించిన ఎస్జీఎఫ్ సెక్రటరీ బి. వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు రాజయ్య, కృష్ణమూర్తి, ఖేలో ఇండియా కోచ్ రాకేష్ తదితరులు విద్యార్థులను అభినందించారు.