24 April, 2026 | 1:51 AM

కమ్యూనిస్టులు భూములు పంచితే..

24-04-2026 12:00 AM
  1. నేడు గుంజుకుంటున్న పాలకులు
  2. రామ్ జీ చట్టం బోగస్... ట్రేడ్ ఒప్పందాలు దేశానికే ప్రమాదకరం
  3. విదేశాంగ విధానంలో మోడీ సర్కారు విఫలం.
  4. 20 శాతం ధనిక రైతుల చేతుల్లో 80 శాతం భూములు గ్రామీణ భారతంలో అసమానతలు పెరగడం ఆందోళనకరం
  5. భూ సంస్కరణలు జరగాల్సిందే బీజేపీ ఎదుర్కొనేందుకు ఐక్యసంఘటనా పోరాటాలు అత్యావశ్యకం
  6. అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ దావలె 

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 23, (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణలో, ప్రభుత్వాల ద్వారా కేరళ, బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు పేదలకు లక్షలాది ఎకరాల భూములను పంచితే నేటి పాలకులు రైతుల నుంచి భూములను గుంజుకుంటున్నాయని ఆలిండియా కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ దావలే ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేగా చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమన్నారు. దాని స్థానంలో తీసుకొచ్చిన రామ్ బోగస్ అని విమర్శించారు.

బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదక రంగా మారాయన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు ఐక్య సంఘటనా పోరాటాలు చేయ డం అత్యావశ్యకం అని నొక్కి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సామినేని రామారావు నగర్ లో గురువారం ప్రారంభమైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఆ సభలో దావలే మాట్లాడుతూ. సామినేని రామారావు, కాసాని ఐలయ్యకు ఘన నివాళి అర్పించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీల ఇలాఖా అనీ, పోడు భూముల హక్కు కోసం పోరాడిన నేల ఇది అని కొనియాడారు. వేలాది సింగరేణి కార్మికుల అడ్డా అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా సింగరేణి సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 1.17 లక్షల నుంచి 40 వేలకు పడిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాల వల్ల సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థమైందన్నారు. బొగ్గుగనులకు వేలం వేసి అందులో సింగరేణి సంస్థనూ పాల్గని దక్కించుకోవాలని పాలకులు చెప్పడం దుర్మార్గమన్నారు. సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించాలని కోరారు.

50 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి సంస్థకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది వీరమరణం పొందారనీ, ఆ పోరాటం ద్వారా పేదలకు పది లక్షల ఎకరాల భూములను కమ్యూనిస్టులు పంచా రని గుర్తుచేశారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజా్ఞూకృష్ణన్ మాట్లాడుతూ..11 ఏండ్ల పాలనలో ప్రజలకు మోడీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పైగా, ప్రజల నుంచి బలవంతంగా భూములను గుంజుకుంటున్న తీరును ఎత్తిచూపారు. మూడు నల్లచట్టాలు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఎర్రజెండా నేతృత్వంలో బలమైన పోరాటాలు రావాలని ఆకాంక్షించారు.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో విఫలమైందని విమర్శించారు. తెలంగాణలో నవంబర్ నెలలో ఏఐకే ఎస్ జాతీయ మహాసభలుంటాయని ప్రకటించారు.   మాజీ ఎంపీ తమ్మినేని వీరభ ద్రం, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంక ట్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్,

సీనియర్ నేతలు సారంపల్లి మల్లారెడ్డి, అరిబండి ప్రసాద్, జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జాతీయ నేత జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి, రైతు సంఘం మహిళా విభాగం కన్వీనర్ కందాల ప్రమీల, రైతు సంఘం భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, న్యాయవాది శివరాంప్రసాద్, తదితరులు పాల్గన్నారు.