calender_icon.png 4 December, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉదృతం చేస్తాం

04-12-2025 12:00:00 AM

చలో హైదరాబాద్ కు రంగారెడ్డి జిల్లా నుండి భారీగా తరలిన జర్నలిస్టులు

శంకర్ పల్లి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించే వరకు ప్రజాస్వామ్యం యుతంగా తమ నిరసనలను ప్రభుత్వం దిగివచ్చే కొన సాగిస్తామని రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండి సలీం పాషా,  కార్యదర్శిసత్యనారాయణలు అన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు.జిల్లా వ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు ధర్నా కు హాజరయ్యారు.రంగారెడ్డి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివచ్చి ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని  వారు డిమాండ్ చేశారు.

ధర్నాకు  శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్ నగర్, ఎల్బీనగర్ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి  నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నూతన జర్నలిస్టులకు అక్రీడేషన్లు, హెల్త్ కార్డులు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వృత్తి కమిటీలు నియమించాలని, చిన్న, మధ్యతరగతి పత్రికలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.