04-12-2025 12:00:00 AM
మొయినాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): మండల పరిధిలోని కనకమామిడి గ్రామం లో బుధవారం దత్తాత్రేయ ఆలయంలో దత్త పూర్ణిమ ఉత్సవాలు మొదటి రోజు ఉపవాసములతో గురుదత్తకు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని మామిడి తోరణాలతో, పూలమాలలతో అలంకరించి ఉపవాసం ఉన్న స్వాములు పూజారిచే పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం సమర్పించారు.
రెండవ రోజు గురువారం ఉదయం అభిషేక అలంకరణతో ప్రారంభం అవుతుందని ఆలయ నిర్వహకులు, పూజారులు పేర్కొన్నారు. ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సద్గురు వారణాసి రామయ్య మందిరంలో దత్తపూర్ణిమ ఉత్సవాన్ని విజయవంతం చేసి స్వామి వారి తీర్థప్రసాదం, అన్నదానం స్వీకరించాలని కోరారు.