1 July, 2026 | 6:59 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

రైల్వే ప్రాజెక్ట్ తరలిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

17-12-2025 12:19 AM

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రకటన 

మహబూబాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాకు మంజూరు చేసిన మెగాప్రైట్ మెయింటెనెన్స్ డిపో మహబూబాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, ఇతర సాకులతో ప్రాజెక్టు ఇతర ప్రాంతానికి తరలిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా తాను సిద్ధమని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రకటించారు.

మానుకోటలో మెగాప్రైట్ రైల్వే డిపోను ఏర్పాటు చేయడానికి చేస్తున్న ఉద్యమానికి బిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే మెగా ప్రాజెక్టు మహబూబాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, ఇంత పెద్ద ప్రాజెక్టు ఇతర ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతుంటే ప్రస్తుత ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.