17-12-2025 12:18:08 AM
వెంకటాపూర్(రామప్ప), డిసెంబర్16(విజయక్రాంతి):మండలంలోని పాలంపేట గ్రా మంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని మంగళవారం నార్వే, అమెరికా దేశాలకు చెందిన కట్రీస్ ఆర్. మదర్వేల్, రాధవన్, భుపేందర్ కత్రీలు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమా శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, కాకతీయుల శిల్పకళా వైభ వం, నిర్మాణ విశిష్టతలను స్టేట్ గైడ్ కరుణానిధి, టూరిజం గైడ్ విజయ్ కుమార్లు విదేశీ అతిథులకు వివరించారు. అనంతరం వారు రామప్ప చెరువును సందర్శించి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బందిలు ఉన్నారు.