22-05-2025 12:00:00 AM
తహసీల్దార్
టేకులపల్లి, మే 21(విజయక్రాంతి):టేకులపల్లి మండలంలో మీ సేవలు బినామీలతోని నడుస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బుధవారం తహసీల్దార్ ముత్తయ్య మీ సేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కం టే ఎక్కువ డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు.
ప్రభుత్వం నియ మించిన రసీదు ప్రకారం డబ్బులు తీసుకుని సమయపాలన పాటించాలని సూచిం చారు. మీ సేవ ఓనర్ ఉండి ఆపరేటర్ను పె ట్టుకోవచ్చని, బినామీలతో నడుపుతూ, విధివిధానాలు పాటించకుండా ఉంటె ఆర్థరైజే షన్ తొలగించబడుతుందని తహసీల్దార్ హెచ్చరించారు.