calender_icon.png 24 May, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వైద్యులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడులు

22-05-2025 12:00:00 AM

తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో రెండు వైద్యశాలను సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు

కందుకూరు,మే 21 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరాల గ్రామంలో నకిలీ వైద్యులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు దాడులు చేసి రెండు వైద్యశాల లో తనికిలు చేసి క్రమంగా నిలువ చేసిన డ్రగ్స్ నకిలీగా తేలడంతో అట్టి వైద్యశాలను సీజ్ చేశారని సమాచారం.

బాలాజీ క్లినిక్ మరో ప్రథమ చికిత్స కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేసి అందులో నక్లీ డ్రగ్స్ అమ్ముతున్నారని నేపథ్యంలో తనిఖీలు చేయగా పూర్తిగా నకిలీ మందులు ఉక్రయిస్తున్నారన్న సమాచారంతో  పట్ల సమాచారం అందుకున్న డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులు బుధవారం ఆ గ్రామంలో ఉన్న ఆసుపత్రులపై దాడులు చేసి పూర్తి సమాచారంతో అధిలారులు తనిఖీలు నిర్వహించి రెండు ఆసుపత్రులను సీజ్ చేసినట్లు సమాచారం.

మహేశ్వరం నియోజకవర్గంలో పరిధిలో పలు మండలాలు కందుకూరు,మహేశ్వరం  బాలాపూర్,సరూర్నగర్,పహాడీ షరీఫ్  తదితర ప్రాంతాల్లో  ఆసుపత్రులు అనుమతి లేనివి ఎన్నో నెలకొన్న నేటికీ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేయకపోవడం  విడ్డూరంగా ఉంది.

ఇలాంటివి కోకొల్లగా జరుగుతున్న కొన్ని సంవత్సరాలుగా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు బుధవారం రోజు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించగా ఆసుపత్రి మెడికల్ షాప్ ల యాజమాన్యులు వారి గుట్టు రట్టు చేశారు. ఇలాంటి డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.