calender_icon.png 24 May, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై అక్రమ నిర్మాణాలు తొలగించిన హైడ్రా

22-05-2025 12:00:00 AM

మేడ్చల్, మే 21(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో రోడ్డుపై అక్రమ నిర్మాణాలను హైడ్రాధికారులు బుధవారం తొలగించారు. యాదాద్రి రెసిడెన్షియల్ కాలనీలో లే అవుట్ మధ్యలో 30 అడుగుల రోడ్డును ఆక్రమించి సేజ్ స్కూలు యాజమాన్యం ప్రహరీ, భవనాలు నిర్మించింది. 5.2.0 ఎకరాల్లో 80 ప్లాట్లు ఈ వెంచర్ లో ఉన్నాయి.

వరంగల్ హైవే ను ఆనుకుని ఉంది. వరంగల్ హైవే ను కలిపే 3 అడుగుల రోడ్డును యజమాని జస్వంత్ రెడ్డి మూసివేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై యాదాద్రి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి రోడ్డు ఆక్రమించినట్టు గుర్తించారు. దీంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి రోడ్డు క్లియర్ చేశారు. దీంతో ఆ కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పర్వతాపూర్ లో పర్యటించిన హైడ్రా కమిషనర్ 

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బుధవారం పర్యటించారు. ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలు కబ్జాకు గురవుతున్నాయని హైడ్రాకు ఫిర్యాదులు రాగా ఆయన స్వయంగా పరిశీలించారు. మూడు నాలుగు రోజుల్లో ఆక్రమణలు తొలగిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.